Site icon NTV Telugu

Jupally Krishna Rao : చర్లపల్లి ఘటనపై మంత్రి కీలక నిర్ణయం

Jupally

Jupally

Jupally Krishna Rao : హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్లో రాష్ట్ర ఆబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం, డ్రగ్స్ హడల్స్‌ట్రేషన్ వంటి సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, ఎక్కడైనా కల్తీ మద్యం లేదా డ్రగ్స్ లాంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని అధికారులకు స్పష్టంగా హెచ్చరించారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి

చర్లపల్లి ఘటనపై వస్తున్న వార్తలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అక్కడ 12 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్తలు వాస్తవం కాదని, నిజానికి 3 నుండి 4 కోట్ల వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశామని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రదేశం పెద్ద ఫ్యాక్టరీ కాకుండా చిన్న షెడ్ మాత్రమేనని, అక్కడ కొంతమంది డ్రగ్స్ తయారీ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న సమయంలో పట్టుకున్నామని వివరించారు. ప్రభుత్వ పరువు పెంచే విధంగానే వ్యవహరించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను సహించబోమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేసినా వదిలేది లేదని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Dammannapet : దమ్మన్నపేటలో అడవి హక్కులపై ఘర్షణ, ఫారెస్ట్ అధికారులపై ఆదివాసీల ఆగ్రహం

Exit mobile version