Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలు నిరసన తెలియజేశారని చురుకలంటించారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మండిపడ్డారు. ఇంకా బుద్ధి తెచ్చుకోక అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో ఇది అవాస్తవమని నిరసన చేస్తారు.. ప్రజలకు సంక్షేమ అందటం అవాస్తవమని నిరసననా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్న ప్రతిపక్షాలు.. మేమిస్తున్న మంచినీళ్లు ప్రతిపక్షాలు తాగడం అవాస్తవమా? అంటూ ప్రశ్నించారు. ఫ్లోరిన్ నీటి నుండి విముక్తి చేయడం అవాస్తవమా? ఏ అభివృద్ధి జరగలేదో చెప్పాలి.. అంటూ సవాల్ చేశారు. అబద్దాలతో ప్రజలను నమ్మిస్తామని మూర్ఖపు భావనలో ప్రతిపక్షాలు అంటూ మండిపడ్డారు. చీకట్లో నడిచే వారు వెలుగును సృష్టించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగును చూడటం ఇష్టంలేని వారు ఎప్పటికి చీకట్లోనే ఉండిపోతారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇక ప్రజలకు సంక్షేమ ఫలాలు అందటం అవాస్తవమని నిరసనా తెలుపుతారా ? అని నిలదీశారు.
Read also: Parks Closed: రేపు హైదరాబాద్‌లో పార్కులు బంద్.. హెచ్ఎండీఏ అధికారులు వెల్లడి
కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని ఖర్చు చేసి బీఆర్ ఎస్ ప్రచార కార్యక్రమాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘దశబ్ది దగా’ పేరిట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రావణాసురుడి రూపంలో కేసీఆర్ దిష్టిబొమ్మను తయారు చేయాలని సూచించిన విషయం తెలిసిందే..
Sharada Rajan: మూడే పాటలతో పాపులారిటీ!!