NTV Telugu Site icon

Jagadish Reddy: బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తాం.. కవిత ఈడీ విచారణపై మంత్రి ధ్వజం

Jagadish Reddy

Jagadish Reddy

Minister Jagadish Reddy Fires On BJP Over Kavitha ED Investigation: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. రాజకీయ ప్రత్యర్థులని వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువైయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. విచారణ పేరుతో ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారని అన్నారు. మహిళల విచారణ పట్ల నిబంధనలు పాటించడం లేదని ఫైర్ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని కవిత చెప్పినా కూడా.. రాత్రి వరకు విచారించడం వేధింపులేనని పేర్కొన్నారు. మహిళల హక్కులను గౌరవించాలని, చట్ట పరిధికి లోబడి విచారించాలని సూచించారు. చట్టంలో లోసగులను అడ్డంపెట్టుకుని.. వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈడీ పని చేస్తోందని చెప్పారు. బీజేపీ నాయకులు ముందే చెప్పినట్లుగా.. విచారణ సంస్థలు పని చేస్తున్నాయన్నారు. బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతామని.. దేశాన్ని బీజేపీ నుండి రక్షిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.

Srinidhi Shetty: ‘కెజిఎఫ్’ సెట్ లో యష్ నన్ను వేధించాడు.. పచ్చి అబద్దం

ఇదిలావుండగా.. ఎమ్మెల్సీ కవిత రేపు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు. రేపే తమ పిటీషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కవిత తరఫు న్యాయవాదులు కోరనున్నారు. 20వ తేదీన సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం ముందు.. అత్యవసర విచారణకు ప్రస్తావనకు చేయనున్నారు. విచారణ సందర్భంగా ఈడీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, తనకు ఈడి ఇచ్చిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు.

Swapna Lok Fire Accident: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం