కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు సంబరాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటూ అటు పార్టీ కార్యకర్తలను, రైతులను ఉత్సాహ పరుస్తున్నారు. కాగా మరోవైపు ప్రభుత్వం రైతుబంధు సంబంధించిన అంశాలను రైతులకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో జరిగని రైతు బంధు కార్యక్రామానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. విత్తనాలను మొలకెత్తించి వాటిలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించటం సాధారణమైన విషయం కాదని మంత్రి అన్నారు. వారం రోజులుగా రైతు బంధు వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు స్వచ్ఛంధంగా బయటకు వచ్చి రైతుబంధు సంబరాల్లో పాల్గొంటున్నారన్నారు. వినూత్న రీతిలో ప్రజలు ఇళ్ల ముందు ముగ్గులు వేసి రైతు బంధు అందించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో రైతు వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని మండిపడ్డారు. 50 వేల600 కోట్ల రూపాయాలను రైతు బంధు ద్వారా పేదలకు పెట్టుబడి రూంలో అందించామని తెలిపారు.
Read Also: రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజాప్రతినిధులు
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
ప్రతి ఏటా సగటున 60వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలోని రైతాంగం కోసం ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. 15నెలల పాటు లక్షల మంది రైతులు ఢిల్లీ చుట్టూ చేరి నల్ల చట్టాల ఉపసంహరణ కోసం పోరాటాలు చేశారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని రైతులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.ప్రజల చేతుల్లో ఉన్న ఆహార రంగాన్ని కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని దీన్ని తిప్పికొట్టాలన్నారు. సాగు నీటిని ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. సత్తుపల్లి ప్రాంత ఫామాయిల్ రైతుల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
ట్రాక్టర్ నడిపిన సబితా ఇంద్రారెడ్డి..
రైతుబంధు సంబరాల్లో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రాక్టర్నడిపారు. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో రైతు సంబరాల్లో పాల్గొని ఎడ్ల బండి, ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు. దీంతో తమతో ట్రాక్టర్, ఎడ్లబండిలో మంత్రి రావడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!