NTV Telugu Site icon

Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం

Indrakiran Reddy

Indrakiran Reddy

Minister Indrakiran Reddy Challenges Maheshwar Reddy: మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాజాగా మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టమని సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణల్ని ఆధారాలతో సహా నిరూపిస్తే.. చట్టప్రకారం తాను ఏ శిక్షనైనా ఎదుర్కోవడానికి సిద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మ‌హేశ్వర్ రెడ్డి ప‌నైపోయిందని.. రేపోమాపో పార్టీ మారడం ఖాయమని అన్నారు. తనపై అస‌త్య ప్రచారం చేస్తున్నందుకు.. మ‌హేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేశార‌ని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారని, ఆరోపణలపై రుజువులు చూపాలని కోరారని చెప్పారు. రాహుల్ గాంధీపై అన‌ర్హత వేటు వేస్తే.. ఆ అంశంపై మ‌హేశ్వర్ రెడ్డి గానీ, ఆ పార్టీ కార్యక‌ర్తలు గానీ స్పందించలేదన్నారు. కానీ.. మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తే మాత్రం.. కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ స్పందించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉంద‌ని పేర్కొన్నారు.

Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు

నిర్మల్ జిల్లా మామ‌డ మండల కేంద్రంలో నిర్వహించిన‌ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకిరణ్ మాట్లాడుతూ.. నాయ‌కులు, కార్యకర్తలందరూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజల గురించి గొప్పగా ఆలోచించే వ్యక్తి మనకు సీఎంగా ఉండటం అందరి అదృష్టమని చెప్పారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి.. మరోసారి పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు. గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమ ప‌థ‌కాల‌తో రాష్ట్రంలో వరిసాగు రెట్టింపు అయ్యిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు, బీడీ కార్మికులకు ప్రతినెలా పెన్షన్‌తో పాటు క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల ద్వారా పేదింటి ఆడ‌బిడ్డలకు పెళ్లి కానుకలను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతులు, సామాన్య ప్రజ‌ల‌ ఆదాయాన్ని పెంచడం కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తుంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం అన్ని వస్తువుల ధరల్ని పెంచుతూ సామాన్యుల‌పై మోయ‌లేని భారాన్ని మోపుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరల్ని పెంచుతోందని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహ‌న‌దారులు అల్లాడిపోతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

Earthquake: జపాన్ లో భారీ భూకంపం.. నో సునామీ వార్నింగ్..

Show comments