NTV Telugu Site icon

Harish Rao: రిస్క్ వద్దు.. కారుకు ఓటు గుద్దు..

Harish Rao

Harish Rao

Harish Rao: రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు అని మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లు అంటే ఖాళీ కుర్చీలని.. బీఆర్ఎస్ మీటింగ్ అంటే జన నీరాజనాలని అన్నారు. సమైక్య వాదులకు చుక్కలు చూపించిన మానుకోట మట్టికి రాళ్లకు దండం అన్నారు. తెలంగాణ రాకముందు మానుకోట ఎలా వుండే.. నేడు ఎలా వుందో ప్రజలు ఆలోచించాలని మంత్రి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఏమి చేసిందో చూడాలని తెలిపారు. రేవంత్ రెడ్డి కి బుతులు తప్ప భవిష్యత్ తెలువదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కరెంటు కష్టాలు అన్నారు. రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read also: Hrithik Roshan: ఫైటర్ టీజర్ వచ్చే డేట్ లాక్ అయ్యింది…

రైతుబందు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసారని అన్నారు. కేసీఆర్ అంటే మాట తప్పని వాడు మడమ తిప్పని వాడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు 15 వేలు అన్నాడు.. అదే కేసీఆర్ ఎకరాకు 15 వేలు అంటున్నారని స్పష్టం చేశారు. శంకర్ నాయక్ మనిషి.. కానీ మాట ఒక్కటే కఠినమని తెలిపారు. గిరిజనులకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది కేసీఆర్ అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే గిరిజన బంధును అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Read also: MLC Kavitha: అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా.. షుగర్ ఫ్యాక్టరీని మూసింది బిజేపీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌కు వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు హెలికాప్టర్‌ సమన్వయ లోపంతో ల్యాండ్‌ అయింది. దీంతో ఓ చోట దిగాల్సిన హెలికాప్టర్ మరోచోట దిగింది. మహబూబాబాద్‌లో దిగాల్సిన హెలికాప్టర్‌ స్వల్ప లోపంతో గూడూరు మండల కేంద్రంలో ల్యాండ్‌ అయింది. దీంతో మంత్రి పీఏపై మండిపడ్డారు. చేసేదేమీలేక హరీశ్ రావు అందుబాటులో ఉన్న కారులో మహబూబాబాద్ రోడ్ షోకు బయలుదేరారు. ఎన్నికల ప్రచార సమయం దగ్గరపడుతుండటంతో హరీశ్ రావు రాష్ట్రంలో వరుస పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.
Hrithik Roshan: ఫైటర్ టీజర్ వచ్చే డేట్ లాక్ అయ్యింది…