Site icon NTV Telugu

Harish Rao: త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్

Harish Rao

Harish Rao

Harish Rao: రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 5 క్యాత్‌ల్యాబ్స్, 5 ఎంఆర్ఐ, 30 సిటీ స్కాన్‌లు ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వీటితో పాటు 1020 అధునాతన పరికరాలు ఉన్నాయన్నారు. ఇవి పాడైన సందర్భంలో రిపేర్ కోసం 8888526666 కాల్ సెంటర్ ఏర్పాటు వేశామని మంత్రి వెల్లడించారు. కొన్ని గంటల్లో పరికరాలను రిపేర్ చేయడం… ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు.

కరోనా కేసులు అక్కడక్కడ వస్తున్నాయన్న మంత్రి హరీష్.. బూస్టర్ డోస్‌ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బూస్టర్ డోస్ సరఫరాలో మోడీ సర్కార్ విఫలం అయ్యిందని ఆయన మండిపడ్డారు. 100 శాతం బూస్టర్ డోస్ పూర్తి అయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్‌ పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలోని 9 జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. 1,50 ,000 మంది గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌లు ఇస్తామని మంత్రి తెలిపారు.

Srinivas Goud: నేను కాల్చింది రబ్బర్ బుల్లెట్.. రాజీనామా చేయడానికి రెడీ

మరోవైపు అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మ ప్రసాదించినట్లవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. మనం చనిపోయినా అవయవదానం ద్వారా ఇతరుల రూపంలో జీవించే ఉంటామని చెప్పారు. అందువల్ల అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. ‘అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి బతకడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచ ఆర్గాన్‌ డొనేషన్‌ డే సందర్భంగా ప్రజలు అవయవాలను దానం చేడానికి తమ పేర్లను నమోదుచేసుకోవాలని కోరుతున్నాను’ అని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

Exit mobile version