Site icon NTV Telugu

కిష‌న్ రెడ్డి వాస్త‌వాలు వ‌క్రీక‌రించి మాట్లాడుతున్నారు : హరీష్ రావు

ఎయిమ్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మ‌రో మారు త‌ప్పుడు ప్ర‌చారం అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బీబీ న‌గ‌ర్ ఎయిమ్స్ విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వాస్త‌వాలు వ‌క్రీక‌రించి మాట్లాడుతున్నారు. మొన్న‌నేమో ఎయిమ్స్ కి భూమి ఇవ్వ‌లేద‌ని ఆరోప‌ణ చేశారు. సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ చూపించాం. ఇప్పుడేమో బిల్డంగ్ డాక్యుమెంట్స్‌, ఎన్విరాన్ మెంటల్ క్లియ‌రెన్స్ అంటున్నారు. రోజుకో తీరుగా మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ విష‌యంలో ఈ ఏడాది అక్టోబర్9 న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కి కేంద్రం లేఖ రాసింది. దీన్ని సంబంధిత శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసి వారం రోజుల్లో టీఓఆర్ ఇచ్చేలా కృషి చేసింది.

తెలంగాణ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా భూమిని అప్పగించాలి అని కిష‌న్ రెడ్డి అన‌డం విస్మ‌యం క‌లిగిస్తున్న‌ది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం 201 ఎక‌రాల భూమిని ఎయిమ్స్ కి అప్ప‌గించింది. దానికి సంబంధించిన వివ‌రాల‌ను ఇప్ప‌టికే మీడియా సాక్షిగా విడుద‌ల చేశాం. వైఎస్సార్ హయాంలో ఇప్పుడున్న ఎయిమ్స్ బీబీ నగర్ నిర్మాణ0 జరిగింది… ఎయిమ్స్ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టలేదు.. అని కిష‌న్ రెడ్డి అంటున్నారు.వాస్త‌వం ఏంటంటే.. అప్పుడు పాక్షికంగా మాత్ర‌మే జ‌రిగింది. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత ప్ర‌భు్త్వం రు. 45 కోట్లు ఖ‌ర్చు చేసి (జీవో నెం.443, 10-05-2017 ద్వారా రు. 5కోట్లు, జీవో నెంబ‌ర్ 632, 12-10-2017 ద్వారా రు.40 కోట్లు) ఆసుప‌త్రిని వినియోగంలోకి తెచ్చింది. ఓపీ, డ‌యాగ్నోస్టిక్ సేవ‌ల‌ను ప్రారంభించింది.

తెలంగాణ సాధన తరువాత ఆరోగ్య వ్యవస్థను పటిష్టీకరించడంలో భాగంగా తెలంగాణ కు ఎయిమ్స్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు ముఖ్య మంత్రి గారు స్వయంగా వినతి చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల లో భవన నిర్మాణం జరుగుటకు 2-3 సంవత్సరాల సమయం పట్టడం వలన ఆయా రాష్ట్రాల లో తరగతులు ప్రారంభించడం ఆలస్యం అయ్యింది. కానీ తెలంగాణ లో నిమ్స్ కొరకు తయారు చేయబడిన భవన నిర్మాణ సముదాయాలను AIIMS కు బదిలీ చేయడం వలన తెలంగాణ లో వెనువెంటనే తరగతులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ విస్తరణ ఇబ్బందికరంగా మారిందన‌డం ప‌చ్చి అబ‌ద్ధం. తెలంగాణ ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన భూమిని అప్ప‌జెప్ప‌డంతో పాటు, ఎన్విరాన్‌మెంటల్ క్లియ‌రెన్స్ స‌హా అన్ని ర‌కాల అనుమ‌తుల‌ను అడిగిన వెంట‌నే మంజూరు చేసింది. నేను అబద్ధాలు మాట్లాడటం లేదంటూనే కిష‌న్ రెడ్డి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. మెడిక‌ల్ కాలేజీల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి లేఖ రాసినా స్పంద‌న లేద‌ని త‌ప్పుడు ఆరోప‌ణ చేస్తున్నారు.

అసలు వాస్త‌వం ఏంటంటే… మెడిక‌ల్ కాలేజీలు తెలంగాణ‌కు సాంక్ష‌న్ చేయాల‌ని ఏడేండ్ల‌ నుంచి కేంద్రాన్ని కోరుతున్న‌ది. కేంద్ర ఆరోగ్య మంత్రులు న‌డ్డా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కు ప‌లు మార్లు విన్న‌వించుకున్న‌ది. తాజాగా కూడా మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటు గురించి అడిగింది. అయినా కేంద్రం ప‌ట్టించుకోలేదు. Phase-1, Phase – 2 లో ఒక్క‌టంటే ఒక్క మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేయ‌లేదు. Phase – 3 లో ఉన్న నిబంధ‌న‌ల కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి అవ‌కాశం లేకుండా చేశారు అని పేర్కొన్నారు.

Exit mobile version