Minister Harish Rao: కర్ణాటక ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎన్నికలను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి హరీష్ రావు కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాస్ట్రంలో తామంతా వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు. కర్ణాటకలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో మంచి స్పందన వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల తర్వాత పనిచేస్తామని అన్నారు. తెలంగాణ దేశానికి మోడల్ అని అన్నారు.
Read Also: MI vs KKR: ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ గెలుపు
కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణ పథకాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సిద్ధిపేటలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తమ రాష్ట్రాల్లో రావాలని కోరుకుంటున్నారని అన్నారు. మన సిద్ధిపేటలో కూడా వచ్చే రోజుల్లో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. డబుల్ బెడ్రూం అర్హులందరికి ఇస్తామని అన్నారు. మనం అంతా కలిసి సిద్ధిపేటను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని అన్నారు.
మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారం నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. జేడీయూ పార్టీ కూడా కింగ్ కాకున్నా కింగ్ మేకర్ పాత్ర అయినా పోషించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే కన్నడ ప్రజలు మాత్రం ఈ సారి కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వరని, మళ్లీ హంగ్ తప్పదని ఫ్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని రోజులు సమయం ఉండటంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో జేడీయూ నేత కుమారస్వామికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణను అనుకుని ఉన్న కన్నడ జిల్లాల్లో టీఆర్ఎస్ పనితీరు ఎంతో కొంత పరిచయం ఉంటుందని, అది జేడీయూకు లాభిస్తుందని భావిస్తున్నారు.
