Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర నేడు ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్లో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నకిలీ సీబీఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ను నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల సీబీఐ అధికారి పేరుతో ఓ వ్యక్తి మంత్రి గంగులతోపాటు పలువురిని కలిశాడు. గంగుల, శ్రీనివాస్‌తో దిగిన ఫోటోలతో పాటు పలు అంశాలు వెలుగు చూశాయి. కానీ అతను సీబీఐ అధికారి కాదు. ఈ నకిలీ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మంత్రి గంగులను సాక్షిగా చేర్చింది సీబీఐ. దీంతో ఆయనతోపాటు ఎంపీని విచారించనుంది.ఈ కేసులో సాక్షులుగా విచారణకు సీబీఐ అధికారులు గంగుల కమలాకర్ ను విచారణకు పిలిపించారు. ఈనేపథ్యంలో.. అలాగే టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి కి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది, ఆయన కూడా ఈరోజు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Read also: Y.S.Sharmila: ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడినుంచే పాదయాత్ర.. గవర్నర్ ను కలవనున్న షర్మిల!
నిన్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ అరెస్ట్‌పై నోటీసులు జారీ చేసి, ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం నమోదు చేసేందుకు సీబీఐ అధికారులు నిన్న కరీంనగర్‌లోని గంగుల ఇంటికి వెళ్లారు. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చీటింగ్ పాల్పడుతున్నట్లు శ్రీనివాస్ విచారణలో పేర్కొనడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గంగుల కమలాకర్ శ్రీనివాస్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉంది? ఎప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే కోణంలో విచారించానున్నారు. గంగూతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. శ్రీనివాస్ తో గంగుల కమలాకర్ కు ఉన్న సంబంధాలపై సీబీఐ విచారించనుంది.
USA: అమెరికా మారదు.. పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన