Gangula Kamalakar: గంగుల నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు.. విచారణకు సహకరిస్తానన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రికి సంబంధించిన ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టారు. దీంతో.. దుబాయ్ లో కుటుంబంతో ఉన్న గంగుల కమలాకర్ నిన్న అర్థరాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈడీ విచారణ సంస్థ అధికారులకు సహకరిస్తానని చెప్పారు. 30 ఏళ్లకు పైగా తాను, తన బంధువులు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నామని.. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. నేను ఎల్లప్పుడూ చట్ట పరిధిలో పనిచేశాను. చట్టానికి ఎవరూ అతీతం కాదు. నేను సహకరిస్తాను అందుకే నేను దుబాయ్‌కి వెళ్లి 12 గంటల్లో తిరిగి వచ్చాను” అని అతను చెప్పారు. తనపై, తన వ్యాపారాలపై ఈడీ, ఐటీకి చాలామంది ఫిర్యాదులు చేశారని.. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలనే ఉద్దేశ్యంతోనే తాను దుబాయ్ వెళ్లిన 16 గంటల్లోనే తిరిగొచ్చానని పేర్కొన్నారు. నన్ను విచారణ కోసం హైదరాబాద్ రావాలని నిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్ళు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని, దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని విదేశాల పర్యటనలో ఉన్న నేను వచ్చానని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ, ఐటీ దాడులు జరిపించారని అనుమానం వ్యక్తం చేశారు.
Read also: Madhuri Dixit : అందరికీ వయసు పెరుగుతోంటే.. ఈమెకు తగ్గుతోంది..!
Also Read
కమలాకర్‌కి కరీంనగర్లో గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. అతని “చట్టవిరుద్ధమైన” కార్యకలాపాల కారణంగా ఖజానాకు సుమారు ₹ 750 కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ 2012లో అతనిపై కేసు నమోదైంది. శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్, జెఎం, బ్యాక్సీ & కంపెనీ, మైథాలీ ఆధిత్య ట్రాన్స్‌పోర్టు, కేవీకే ఎనర్జీ, అరవిందా గ్రానైట్స్, సైండియా ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌లో సోదాలు నిర్వహించారు. 2011-13 మధ్య కాలంలో గ్రానైట్ అక్రమాలపై ఫిర్యాదులు, 2012లో గ్రానైట్ మైనింగ్ పై కేసు నమోదు చేసి, కేసు ఆధారంగా ఈడి విచారణ చేపట్టారు. గతేడాది నవంబర్‌లో ఆయనపై బీజేపీ నేతలు మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే.. కేంద్రంలోని అధికార పార్టీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి పార్టీ మారేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలతో కేసీఆర్ పార్టీ, బీజేపీ మధ్య కూడా వార్ నడుస్తోంది.అయితే దానిని బీజేపీ ఆరోపణను ఖండించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , కోర్టు పర్యవేక్షణలో ఉన్న ప్రత్యేక దర్యాప్తు బృందం వంటి “స్వతంత్ర సంస్థ” ద్వారా విచారణకు పిలుపునిచ్చింది. బీజేపీ అభ్యర్థనను విచారించిన తెలంగాణ హైకోర్టు, కేసీఆర్ పార్టీ ఆరోపణలను పరిశీలించేందుకు రాష్ట్ర పోలీసులను అనుమతించిన విషయం తెలిసిందే.
Gujarat Assembly elections: 160 మంది బీజేపీ తొలి జాబితా.. రవీంద్ర జడేజా భార్య, హార్దిక్ పటేల్‌కు ఛాన్స్
తాజావార్తలు
-
Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
-
Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!