Minister Errabelli: BRS పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు పక్క అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ విషయంపై క్యాబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలకు మహబూబాబాదు జిల్లా నరసింహులపేట మండలం వేదిక అయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని, కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందని సభా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. ప్రజలలో వ్యతిరేకత ఉన్న 20 మంది ఎమ్మెల్యేలను మార్చాలని అన్నారు. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది.
Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. ఈ భేటీలో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని కొందరు నేతలు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది.
Read also: Vemula Prashanth Reddy: అసంపూర్తిగా తెలంగాణ సచివాలయ పనులు.. 10 రోజుల్లో పూర్తి చేయాలని..
ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరికీ మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలంతా ఖుషీగా ఉంటూ గెలుపుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో.. టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు డీలా పడ్డారని తెలుస్తోంది. అయితే ముఖ్యంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి, టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి మళ్లీ అవకాశం ఇస్తే!అప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడిన తామేం కావాలని సీనియర్ నేతలు వాపోతున్నారట.
Three State CMs: ఇవాళ హైదరాబాద్‌కు మూడు రాష్ట్రాల సీఎంలు.. స్వాగతం పలకనున్న తెలంగాణ మంత్రులు