NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: బీఆర్ఎస్‌ పేరు మార్చేసిన మంత్రి… వైరల్‌గా మారిన వీడియో

Minister Errabelli

Minister Errabelli

దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. విజయదశమి రోజున ముహూర్తం పెట్టి మరీ పార్టీ పేరును మార్చారు.. తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.. టీఆర్ఎస్‌ పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఇవాళ బీఆర్‌ఎస్‌ నేతలు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అందజేయనున్నారు.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌పై చర్చ సాగుతోంది.. టీఆర్ఎస్‌ నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు కూడా హైదరాబాద్‌ వచ్చి.. బీఆర్ఎస్‌ గురించి మాట్లాడారు.. సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.. ఇంతా జరుగుతుంటే.. కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాకు పనిచెప్పాయి..

Read Also: RRR for Oscars: అఫీషియల్.. ఈ 15 కేటగిరీల్లో ఆస్కార్స్ కోసం ఆర్ఆర్ఆర్

విజయదశమిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. రావణ దహనం చేశారు.. ఈ సందర్భంగా ఒక వేదికపై ఆయన మాట్లాడుతూ.. నోరు జారారు.. టీఆర్ఎస్‌ పెట్టి తెలంగాణ సాధించారు.. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌.. ఇప్పుడు భారతీయ… అని మధ్యలో ఆపి.. ఏ పార్టీ పెట్టారని అక్కడి ప్రజలను ప్రశ్నించారు.. ఓ యువకుడు బీఎస్పీ.. మరో యువకుడి నుంచి బీఆర్‌ఎస్‌ అనే సమాధానాలు వినిపించాయి.. కానీ, మంత్రి మళ్లీ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పెట్టింది బీఎస్సీ.. శుభదినం రోజు కేసీఆర్‌ బీఎస్పీ ప్రకటించారు.. జాతీయ రాజకీయాల్లో రాణిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మొత్తంగా.. టీఆర్ఎస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ పార్టీగా మారితే.. మంత్రి ఎర్రబెల్లి మాత్రం.. బీఎస్పీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.. సీఎం ప్రకటించిన పార్టీ పేరు కూడా తెలియదా? లేక మరిచ్చిపోయారా? అంటూ మంత్రిని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు..

Show comments