Malla Reddy: పిల్లలకు 500 నోటు చేతిలో పెట్టిన మల్లన్న.. కండిషన్స్ అప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఎంతో పేరుంది. అది అందరికీ తెలుసు. తెలంగాణ రాజకీయాలే కాదు, సోషల్ మీడియాపై మంచి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ మంత్రి మల్లన్న సుపరిచితమే. ఆయన ప్రసంగం, డైలాగులు అలానే ఉంటాయి మరి. సోషల్ మీడియాలో కూడా మల్లన్న బాగా ట్రెండ్ అయ్యాడు. ‘పాలమ్మిన్నా.. పూలమ్మిన్నా.. బోర్ వెల్ లెడ్.. హార్డ్ వర్క్.. మైక్ దొరికితే చాలు.. పార్టీ మీటింగ్ అయినా.. అసెంబ్లీ అయినా.. అక్కడక్కడా… అంటూ మల్లన్న కష్టపడి పనిచేసిన తీరును వివరిస్తూ అందరినీ తనదైన శైలిలో చైతన్యపరిస్తూ తనదైన శైలిలో నవ్విస్తూ ఉంటారు. అప్పటి వరకు సీరియస్‌గా ఉన్న వాతావరణాన్ని నవ్విస్తుంటారు. మల్లన్న ఎక్కడుంటే అక్కడ జోష్ ఉంటుందని తెలుపుతుంటారు.
Read also: Delhi : అనుమానమే ఆ మహిళ ప్రాణం తీసింది
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. చిన్న పిల్లలకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మంత్రి మల్లారెడ్డి ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బోడుప్పల్ లోని వీరారెడ్డి కాలనీకి వెళ్లారు. ఆయనను చూసిన కొందరు చిన్నారులు మంత్రి మల్లారెడ్డి వద్దకు వెళ్లారు. ‘ వినాయక చవితి.. వినాయకుడిని పెడుతున్నాం.. చందా ఇవ్వండి సార్’ అంటూ పిల్లలు చుట్టుముట్టారు. వారి బుడి బుడి మాటలకు సంతోషించిన మల్లారెడ్డి వెంటనే తన జేబులో చేయి వేసి రూ.500 నోట్ల కట్టలను బయటకు తీసి చిన్నారులకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరికి రూ. 500 పిల్లలకు పంపిణీ చేస్తూ ఈ డబ్బును ఏం చేస్తారు అని ప్రశ్నించారు. పిల్లలు నవ్వుతూ ఏం చేయాలి అంటే వినాయక చవితి కదా దేవుడు దగ్గర పెట్టండి అంటూ కండిషన్స్ పెట్టారు మల్లన్న. దేవుడే దగ్గరే పెడతారా ఈ డబ్బులు దేనికైనా ఉపయోగిస్తారా? అంటూ ప్రశ్నిస్తే ఆ.. దేవుడే పెడతాం అంటూ పిల్లలు సమాధానం ఇచ్చారు. ఆ తరువాత డబ్బులు తీసుకున్న పిల్లలు సంతోషించి జై మల్లన్న అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలు విని మంత్రి మల్లన్న కూడా చలించిపోయారు. సరే సరే వెల్లండి అంటూ చిన్నారులతో కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి మల్లారెడ్డి వెళ్లిపోయారు.
Rohit Sharma: ఏళ్లు గడిచినా ఈ విజయంను మరిచిపోలేం.. ఈ క్రెడిట్ సిరాజ్‌దే: రోహిత్ శర్మ
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!