Rohit Sharma: ఏళ్లు గడిచినా ఈ విజయంను మరిచిపోలేం.. ఈ క్రెడిట్ సిరాజ్‌దే: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Heap Praise on Mohammad Siraj after Asia Cup 2023 Final: ఏళ్లు గడిచినా ఆసియా కప్ 2023 ఫైనల్ విజయంను మరిచిపోలేమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ విజయం క్రెడిట్ మొత్తం మొహ్మద్ సిరాజ్‌దే అని ప్రశంసించాడు. గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదని, సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం కొలొంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. సిరాజ్ 6 వికెట్స్ (6/21) పడగొట్టగా.. ఒకే ఓవర్లో 4 వికెట్స్ తీశాడు. దాంతో లంక 50 పరుగులకే ఆలౌట్ అయింది.
ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఇదో గొప్ప ప్రదర్శ. ఫైనల్లో ఈ తరహా ప్రదర్శన మానసిక బలాన్ని చూపిస్తుంది. బంతితో అద్భుతమైన ఆరంభం దక్కాక.. బ్యాట్‌తో మంచి ముగింపు ఇచ్చాం. వికెట్స్ పడుతుంటే నేను స్లిప్‌లో నిలబడి అలా చూస్తూ ఉండిపోయా. మా సీమర్‌లు చాలా కష్టపడుతున్నారు. స్పష్టమైన ప్రణాళికలతో బౌలింగ్ చేశారు. ఈ విజయం ఏళ్లు గడిచినా మరిచిపోలేనిది. ఈ స్థాయిలో చెలరేగుతారని నేను అస్సలు ఊహించలేదు. ప్రతీ ఒక్కరు రాణించారు’ అని అన్నాడు.
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
‘ఈ విజయం క్రెడిట్ మొహ్మద్ సిరాజ్‌దే. గాలిలో బంతి మూవ్ చేసే సీమర్లు చాలా అరుదు. సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉంది. ఓ జట్టుగా ఈ టోర్నీలో మేం చేయాల్సినవన్నీ చేశాం. భారత్ వేదికగా జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రపంచకప్ 2023 కోసం ఎదురుచూస్తున్నాం. మెగా టోర్నీలోనూ సత్తా చాటుతాం. పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడిలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు బాదారు. శుభ్‌మన్ గిల్ బాగా ఆడాడు. కుర్రాళ్లు వివిధ దశల్లో తమ బాధ్యతను నిర్వర్తించారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!