Site icon NTV Telugu

Adluri Laxman : మీరు బహిరంగ చర్చకు సిద్ధమా.. మంత్రి అడ్లూరి సవాల్‌

Adluri Laxman

Adluri Laxman

Adluri Laxman : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “మా ప్రభుత్వం రెండేళ్లు కూడా పూర్తవ్వకముందే బీఆర్‌ఎస్‌ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. “బీఆర్‌ఎస్‌ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా తమ వాగ్దానాలను అమలు చేయలేదు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మా ప్రభుత్వంపై బోగస్ ఆరోపణలు చేయడం తప్ప మరేం చేయడం లేదు” అని అన్నారు.

Kapil Sharma: కపిల్ శర్మ కెనడా కేఫ్‌లో మరోసారి కాల్పులు..

మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం.. మీరు నిజంగా ప్రజల కోసం పనిచేస్తే రండి, ప్రజల ముందే చర్చిద్దాం అని మంత్రి అడ్లూరి లక్మణ్ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తనపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు మంత్రి పదవి వచ్చి మూడు నెలలు మాత్రమే అయ్యింది. అప్పుడే నా మీద విమర్శలు చేస్తున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకే తెలుసు అని తీవ్రంగా విమర్శించారు.

అంతేకాకుండా.. 100 ఏళ్ల పార్టీ అయిన కాంగ్రెస్‌లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమే. కానీ మేమంతా ఒకటే కుటుంబం. మాకు మా కార్యకర్తలు, ప్రజలే దేవుళ్లు — వాళ్ల వల్లే మేము ఇక్కడ ఉన్నాం అని పేర్కొన్నారు. అలాగే, “గతంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కేసీఆర్‌ చేయి పట్టి వేరే చోట కూర్చోమన్నది మరచిపోయారా?” అంటూ హాస్యంగా గుర్తు చేశారు.

PM Modi: ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం మారుతోంది.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..

Exit mobile version