Tiger attacks: పులుల సంచారం జనంలో భయాందోళనరేకెత్తిస్తోంది..వరుసబెట్టి పశువులపై పంజా విసురుతుండడంతో జనం వణికిపోతున్నారు..ఎక్కడ ఎటు వైపు నుంచి వచ్చి విరుచుక పడుతుందోనని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. కొమురం భీం జిల్లాతోపాటు ఆదిలాబాద్, భూపాలపల్లి, మహారాష్ట్రలో పులుల సంచారం కలకలం రేపుతోంది.
కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిదిలో పులుల సంచారం పెరిపోతుంది. మరీ ముఖ్యంగా కాగజ్ నగర్ మండలం వేంపల్లి, కోసిలి, అనుకొడ ప్రాంతాల్లో వారం రోజులుగా పులుల సంచరిస్తున్నాయి. అంతేకాదు వరుసగా పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఇప్పటికే పది రోజుల్లో 8 పశువులను చంపేసిన పులి తాజాగా మండలం కోసిని బెస్ క్యాంప్ పక్కన అటవిలో ఎద్దు పై దాడి చేసింది.పులి దాడి లో ఎద్దు తీవ్రగాయాలో ఇంటికి చేరింది. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ ,అలాగే తలమడుగు మండలాల్లో మహరాష్ట్ర నుంచి వచ్చిన పులి సంచరిస్తుంది..మొన్న బజార్ హత్నూర్ మండలంలోని ఆవులమందపై దాడి చేసిన పులి ఓ ఆవును చంపేసింది. తలమడుగు మండలంలో పల్సిబి.శివారులో పులిదాడిలో ఎద్దు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారంతో అక్కడకు చేరుకున్న అధికారులు చనిపోయిన ఎద్దు కుచులాపూర్ గ్రామానికి చెందిన వెంకన్నకు చెందిందిగా గుర్తించారు. పులి సంచారం నిజమేనని సాయంత్రం, ఉదయం వేళల్లో అటవీ ప్రాంతాల వైపు వెల్లవద్దని పోలీసులు హెచ్చరించారు..ఈరెండు జిల్లాల్లో పులుల సంచారం, పశువులపై పడి చంపేస్తుంటే రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు మాత్రం పులి రక్షణతోపాటు జనం రక్షణ కోసం చర్యలు చేపట్టుతున్నట్లు చెప్పుతున్నారు.
Read also: Kotideepotsavam 2022: ఐదవ రోజుకి చేరిన కోటి దీపోత్సవం.. ఈ రోజు ఏముంటాయంటే?
ఇక భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో పెద్దపులి బీభత్సం సృష్టిస్తోంది. కామన్ పల్లి కిష్టపురంపాడ్, దేవాదుల ప్రాజెక్ట్ పైపులైన్ సమీపంలో ఆవు, లేగదూడపై దాడి చేసి చంపేసింది. పులి కదలికలను గుర్తించెందుకు ఫారెస్ట్ అధికారులు సీసీ కెమరాలను అమర్చారు. పులి సంచారంతో.. పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహా రాష్ట్ర లోని గడ్చిరోలీ, చంద్రా పూర్ రెండు జిల్లాల్లో పులుల దాడులు సంచలనంగా మారింది. ఇద్దరి వ్యక్తులపై పులి పంజావేయడంతో వారు చనిపోయారు. చంద్రాపూర్ జిల్లా లో ఒక్కరు, గడ్చిరోలీ జిల్లా లో ఒక్కర్ని పులి చంపేసింది. మృతులు చంద్రాపూర్ జిల్లా తోర్గావ్ కు చెందిన జయా బాయి తోండ్రే గా గుర్తించారు పోలీసులు, మరో వ్యక్తి గడ్చిరోలి జిల్లా రాజగాటా కు చెందిన సుధాకర్ బోయర్ గా గుర్తించారు. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరించారు. సాయంత్రం, రాత్రి వేళలో ప్రజలు బయట సంచరించకూడదని తెలిపారు.
Refrigerator Blast: ప్రాణాలు తీస్తున్న ఫ్రిజ్‌లు, గీజర్లు..