Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలు కొనసాగుతుండగానే, ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రాధాన్యతతో పరిష్కరించారు. 2023 మార్చి 4 నుండి 2025 జూన్ 20 వరకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను సమగ్రంగా పరిశీలించి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
Kollywood : అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్ లో సూర్య.?
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు, పింఛన్ హక్కుదారులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించాయి. ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబించిందని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం మారిన సందర్భాల్లో ఈ విధంగా వెంటనే స్పందించిన ఉదాహరణలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన వర్గాలకు న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని సానుకూల చర్యలు కూడా ఆశించదగిన వాతావరణం ఏర్పడిందని ఉద్యోగులు, పింఛనర్లు తెలిపారు.
MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అని బిరుదు ఇస్తున్నాం..
