NTV Telugu Site icon

Medaram Jatara: తిరుగువారం పండుగతో ముగిసిన మేడారం జాతర

Medaram Jatara

Medaram Jatara

Medaram Jatara: మేడారం మహాజాతరకు అంకురార్పణ సమర్పించిన తర్వాత మండమెలిగే ఉత్సవాలను నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నుంచి ఫిబ్రవరి 24వ తేదీ శనివారం వరకు మేడారం మహాజాతర జరిగింది. జాతర ప్రారంభమై వారం రోజులు పూర్తయిన సందర్భంగా మేడారంలో తిరుగువారం ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలోని మాట్ల పూజా మందిరాన్ని సమ్మక్క పూజారులు శుభ్రం చేశారు. ఆదివాసీ మహిళలు సమ్మక్క ఆలయాన్ని శుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయకంగా సమ్మక్క పూజ సామగ్రిని గిరిజన పూజారులు ఆలయంలో ఉంచారు. ఆదివారం గ్రామంలోని గిరిజనులంతా కుటుంబ సమేతంగా కోడిగుడ్లు, యాటలతో వనభోజనానికి వనదేవతలకు నైవేద్యంగా పెడతారు. ఈ కార్యక్రమంతో ఈ ఏడాది మేడారం మహా జాతర ముగిసిందని సమ్మక్క ప్రధాన అర్చకులు కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేష్ తెలిపారు.

Read also: Karimnagar: గ్రేట్‌ సార్‌.. రైతును 2 కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్

ఫిబ్రవరి 21 నుంచి మేడారం వందేవాతల మహాజాతర జరగ్గా.. జాతర సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్‌ బిడ్లు దాఖలు చేశారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకున్న వారు దాదాపు 60 లక్షల మంది ఉండగా, జాతర జరిగిన నాలుగు రోజుల్లోనే 40 లక్షల మందికి పైగా భక్తులు మేడారం తరలివచ్చి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది మహాజాతరకు రెండు కోట్ల మందికి పైగా తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత శనివారం నిర్వహించిన అమ్మవారి వన ప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసింది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే జాతరకు ఇప్పటికీ పోటెత్తుతున్న భక్తులతో మేడారం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మొత్తానికి ముందస్తు పూజలు, జాతర జరిగే నాలుగు రోజులు, ఆ తర్వాత పోటెత్తిన భక్తులతో కేవలం నెల రోజుల్లోనే దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read also: Paytm : పేటీఎంకు పెరుగుతున్న కష్టాలు.. నివేదికలో షాకింగ్ విషయాలు

ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలోని మేడారంలో బుధవారం తిరుగు వారోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. గిరిజన పూజారులు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల క్షేత్రాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహా జాతర ముగిసినా మేడారం జనసంద్రంగా మారుతోందన్నారు. జాతరకు వచ్చిన వారితో పాటు కొత్త భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు. తిరుగువారం ఉత్సవాల్లో దాదాపు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. తిరుగువారం పండుగతో మేడారం మహా జాతర ముగియనుంది. అనంతరం మేడారం మహా జాతరకు సంబంధించిన చిన్న జాతరలు ప్రారంభమవుతాయని వివరించారు. మేడారం జాతరలో పారిశుధ్యం ప్రధాన అంశం. ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!