Karimnagar: గ్రేట్ సార్.. రైతును 2 కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఓ రైతును ప్రాణాలు కాపాడిన తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తుంది. విధుల్లో వున్న కానిస్టేబుల్ కు ఓ రైతు పురుగుల మందు తాగడంలో స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న కానిస్టేబుల్.. రైతును భుజాలపై వేసుకుని రెండు కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కాపాడాడు.. ఈఘటనతో కానిస్టేబుల్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read also: Chiranjeevi: రమణ గాడి ఇంటికి విశ్వంభర
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్‌వేర్
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన కుర్ర సురేష్ బుధవారం ఇంట్లో గొడవపడి తన పొలానికి వచ్చాడు. జీవితంలో విసుగుచెందిన రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. అక్కడున్నవారు గమనించి 100కు సమాచారం అందించగా.. వెంటనే బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అంబులెన్స్ కు కాల్ చేసి అది వచ్చి తీసుకునే వెళ్లే సరికి రైతు ప్రాణాలు మిగలవని భావించి.. వెంటనే కానిస్టేబుల్ జయపాల్ అతడిని భుజాన వేసుకుని పొలాల మీదుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సాయంతో జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతు సురేష్ కు వైద్యులు వెంటనే వైద్యం అందించారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో సురేష్ ను కాపాడిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్, ఇతర సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. జయపాల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సురేష్ ప్రాణాలు కాపాడినందుకు కుటుంబ సభ్యులు జయపాల్ ను కాల్లుపట్టుకుని కృతజ్ఞతలు తెలిపి, కన్నీరుమున్నీరుగా విలపించారు.
TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!