NTV Telugu Site icon

Medak: ఇలా తయారవుతున్నారేంటీ.. భర్తకు వైద్యం చేయించలేక హత్య చేసిన భార్య

Murder

Murder

రోజురోజుకు సమాజంలో మానవులు మరీ దారుణంగా తయారైపోతున్నారు. మానవ సంబంధాలను మంటగలుపుతున్నారు. నిండు నూరేళ్లు భర్తతో కలిసి సంసారం చేయాల్సిన భర్త.. తన చేతులతోనే చంపేసింది. భర్తకు వైద్యం చేయించడానికి డబ్బులు లేవని కట్టుకున్న భర్తనే హతమార్చింది భార్య.. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

Read Also: Washing machine: వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మైనర్ బాలిక మృతి

వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట (మం) బాచారం గ్రామానికి చెందిన భర్త ఆశయ్య (55).. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లి కాలు జారి పడ్డాడు. అయితే అతని కాలు, నడుముకు గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. అయితే భర్త ఆరోగ్యం కుదుటపడటానికి ఆస్పత్రికి డబ్బులు ఖర్చు అవుతాయని భావించిన భార్య శివమ్మ.. తన అల్లుడితో కలిసి భర్తను చంపేసింది. అతను పడుకున్న సమయం చూసి అల్లుడితో కలిసి టవల్‌తో ఉరివేసి చంపారు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాగా.. ఆశయ్య గొంతుపై కుమిలిన గాయం ఉండటంతో బంధువులకు అనుమానం వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. అనంతరం.. బంధువులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భార్య, అల్లుడు నేరం ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: YSRCP: వల్లభనేని వంశీ కేసు.. ఎక్స్‌లో వైసీపీ బిగ్‌ బ్లాస్ట్..!