Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా ఒక కుటుంబంలా ఏర్పడి గంజాయి విక్రయం చేస్తున్న ముఠాను శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ గుట్టురట్టు చేశారు.
ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠాను అదుపులో తీసుకున్నారు. వీరి వద్దనుంచి దాదాపు 15 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేశారు.
Read also: Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు శామీర్‌పేట్ పోలీసులు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండల మజీద్ పూర్ గ్రామంలోని బావార్చి ఎదురుగు ఉన్న ఓపెన్ వెంచర్ వద్ద గంజాయిని సరఫరా చేస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 26 కిలోల గంజాయి, ఒక ఫోర్డ్ ఫిగో కారు, రెండు ద్విచక్రా వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్ లను స్వదినం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. వీటి విలువ మొత్తం దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ రాములు చెప్పారు.
Read also: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే మాధవరం సీరియస్..
సరఫరా చేసే వ్యక్తులు ఎవరికి అనుమానం రాకుండా కార్ లో ఒక కుటుంబంలాగా ఏర్పడి దేశంలోని పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారని ఏసీపీ చెప్పారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాగా, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మరో నలుగురు కొనుగోలు చేస్తున్న వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
Read also: TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్ సేవలు..
ఈ ఏడుగురిలో ఓ మైనర్ బాలికతో పాటు గీత మండల, రిత మిశ్రా మహిళలు ఉండగా నయన్ దాస్, రోహిత్, రాజ్ సింగ్ తోపాటు అనికేష్ సింగ్ పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి మీనా భాయ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ రాములు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ చెప్పారు. అసాంఘిక కార్యపాలపై ఎలాంటి సమాచారం ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీపీ రాములు కోరారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్