Site icon NTV Telugu

Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య

Mdk

Mdk

Wife Kills Husband: మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య.. మద్యం మత్తులో భర్త స్వామి (35) చెరువులో పడి చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. ఇక, పోలీసుల విచారణలో భార్య మౌనిక(28) అక్రమ సంబంధం బాగోతం బయటపడింది.

Read Also: Team India: టీమిండియాకు కొత్త కెప్టెన్, కోచ్, సెలెక్టర్.. భారత క్రికెట్‌లో సంచలన మార్పులు?

అయితే, 12 ఏళ్ల క్రితం స్వామి, మౌనికలకు పెళ్లి జరగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక, తనకంటే తక్కువ వయస్సున్న సంపత్(23) అనే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో పంచాయితీ పెడతానని భర్త హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా భర్తను చంపేయాలని మౌనిక ప్లాన్ వేసింది. గత నెల డిసెంబర్ 22వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయిన స్వామి.. ఇదే అదనుగా భావించి ప్రియుడిని ఇంటికి పిలిచి ఇద్దరు కలిసి భర్త గొంతు నొక్కి చంపేశారు.

Read Also: Bangladesh Squad: వరల్డ్ కప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. టాప్ ప్లేయర్స్‌తో నింపేసిందిగా!

ఇక, భర్త స్వామి చనిపోయిన తర్వాత బైక్ పై మృతదేహాన్ని తీసుకెళ్లి నెరేళ్లకుంటలో పడేసి మద్యం మత్తులో పడి చనిపోయినట్టు కిలేడి మౌనిక నమ్మించింది. అయితే, భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో తమ స్టైల్లో పోలీసులు విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో మౌనికతో పాటు ఆమె ప్రియుడు సంపత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.

Exit mobile version