NTV Telugu Site icon

Cold Wave: ఉమ్మడి మెదక్ జిల్లాను వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

Cold Wave

Cold Wave

ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. చలికి జనం గజగజ వణుకుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.9, న్యాల్కల్ 8.2, అల్గోల్ 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా టేక్మాల్ 9.3, నర్సాపూర్ 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 9.7, బేగంపేట 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

Read Also: Road Accident: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు

మరోవైపు.. సాయంత్రం 5 కాగానే చలి ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల వరకు చలి తీవ్రంగా పెరిగి.. ఉదయం 8 గంటల వరకు చలి ప్రభావం చూపిస్తుంది. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం స్కూళ్లకు వెళ్లే పిల్లలు, పాలు, కూరగాయలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. చలి తీవ్రత ముందు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Read Also: RIP GOUTAM GAMBHIR: టీమిండియా కోచ్‭పై విరుచుకపడుతున్న క్రికెట్ అభిమానులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడడం లేదు. ముఖ్యంగా జాతీయ రహదారులను పొగమంచు తీవ్ర స్థాయిలో కమ్మేస్తోంది. ఈ క్రమంలో.. వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. పొగ మంచు కమ్మేయడంతో కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని రహదారి నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలని, అవసరమైతేనే ఆయా వేళల్లో బయటకి వెళ్లాలని చెబుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Show comments