ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా అరెస్ట్ అయ్యారు. రుణాల ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘన.. సహా పలు ఆరోపణలపై ఈడీ సుఖేష్ గుప్తాను అరెస్ట్ చేసింది. రెండు రోజులపాటు ఎంబీఎస్ ముసద్దిలాల్ జ్యూయలర్స్ సంస్థలో సోదాలు చేసింది ఈడీ. ఎంబీఎస్ జ్యువెలర్స్ తో పాటు సుఖేష్ గుప్తాకు చెందిన సంస్థల్లో పెద్ద ఎత్తున బంగారం ,బంగార ఆభరణాలు ,వజ్రాలు స్వాధీనం చేసుకుంది ఈడీ. అరెస్ట్ అనంతరం సుఖేష్ గుప్తాను సీసీఎస్ కు తరలించింది. మొత్తం ఆరుకేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న సుఖేష్ గుప్తాను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
Read Also: Rs 1100 crore investment: తెలంగాణలో మరో రూ.1100 కోట్ల పెట్టుబడులు.. ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన
మూడేళ్లుగా అనేక చిరునామాలతో తప్పించుకుని తిరుగుతున్నారు సుఖేష్ గుప్తా. దేశ చరిత్రలోనే అత్యధికంగా బంగారం సీజ్ చేశారు ఈడీ అధికారులు. ఫెమా తో పాటు పిఎంఎల్ఏ కింద సుఖేష్ గుప్తా ను అరెస్ట్ చేసింది ఈడీ. విదేశాల నుండి గోల్డ్ ఎక్స్ పోర్ట్స్ బ్యాంక్ ల నుండి రుణాల ఎగవేత, నోట్ల రద్దు సమయంలో ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టి వంటి అనేక ఆరోపణలు వున్నాయి. మొత్తం మూడు నేరాల కింద కేస్ లు నమోదు చేసింది ఈడీ. MMTC నుండి పొందిన గోల్డ్ క్రెడిట్ కు ఎటువంటి పన్ను కట్టలేదు ముసద్దిలాల్ జ్యూయలర్స్.
బ్యాంక్ ల నుండి రుణాలు పొంది ఇతర పనుల కోసం వాడుకున్న వైనం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు సుఖేష్ గుప్తా, అనురాగ్. తాజా సోదాల్లో రూ.100 కోట్లకు పైగా విలువైన బంగారం సీజ్ చేశారు. రూ.50 కోట్లకు పైగా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ సుఖేష్ గుప్తా ను అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Read Also: Wednes Day Lord Ganesh Pooja Live: బుధవారం ఈ స్తోత్రం వింటే మీకు అష్టైశ్వర్యాలు ..