NTV Telugu Site icon

Mayor Vijayalakshmi: నేడు కాంగ్రెస్‌ లోకి గద్వాల్‌ విజయలక్ష్మి.. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో..

Gadwal Vijayalakshmi

Gadwal Vijayalakshmi

Mayor Vijayalakshmi: జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇవాళ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె తండ్రి కేశ‌రావు కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. అయితే ఆమె మార్పుతో ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరినా ఆమె పదవికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు ఎన్నికైన పార్టీ నుంచి మరో పార్టీలోకి మారితే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది కానీ.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల ప్రకారం కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌ల పాత్రలు మారినప్పటికీ వారి పదవులు కోల్పోయే అవకాశం లేదు.

Read also: Pawan Kalyan: పిఠాపురానికి పవన్‌ కల్యాణ్‌.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..

మొత్తం పాలకమండలిలో మెజారిటీతో కూడిన అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారు తమ పదవులను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే ఏ పార్టీలోకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి పదవులకు నష్టం లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత 11 ఫిబ్రవరి 2021న బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 10, 2025 వరకు వారి పదవులకు ఎలాంటి ముప్పు లేదు. వారి పనితీరు బాగా లేకున్నా, మరేదైనా కారణాల వల్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. కాగా.. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అసలు విషయం కాదని అధికారులతో పాటు రాజకీయ నేతలు చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవీకాలం స్వల్పకాలమే ఉండేది. అప్పటికి పార్టీల బలాబలాలలో పెనుమార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
Pawan Kalyan: పిఠాపురానికి పవన్‌ కల్యాణ్‌.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..