NTV Telugu Site icon

Hyderabad: తాళం వేసిన ఇండ్లే టార్గెట్‌.. భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా..

Kukatpalli

Kukatpalli

Hyderabad: తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఇవాళ భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా జరగడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. తాళం వేసిన ఇంటిలో దొంగలు చొరబడి దొరికినకాటికి దోచుకుని పరార్ అయ్యారు. ఇవాళ ఉదయం వచ్చిన యజమాని ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారు..

బాధితులు మధుసూదన్ రావు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయానగర్ కాలనీ శ్రీ సీతా పాలేస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 301 లో తన భార్య సంధ్యారాణితో కలిసి నివాసం ఉంటున్నాడు. నెలరోజుల క్రితం తమ కూతురి ప్రసవం కొసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. అయితే ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చే సరికి తాళం లేకపోవడం చూసి షాక్ తిన్నాడు. ఇంటిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో యజమానికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంటిలో 80 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల రూపాయల విలువైన ఓ డైమండ్ నెక్లెస్, రెండు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్ళినట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన దొంగతనం కూడా ఇలాగే జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు దొంగతనాలు ఒకే విధంగా జరగడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?

Show comments