Site icon NTV Telugu

BiG Breaking: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిదిమంది సజీవ దహనం

Nampalli

Nampalli

BiG Breaking: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. డీఆర్ఎఫ్ బృందాలు రంగాల్లో దిగాయి. 15 మందిని కాపాడినట్లు సమాచారం. తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారు రిపేర్‌ చేస్తుండగా డీజిల్‌ డబ్బాలకు అంటుకున్న మంటలు. మొదటి గ్రౌంగ్‌ ఫ్లోర్‌ లో మొదలైన మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్ దిగువ భాగంలో కొన్నాళ్లుగా అపార్ట్‌ మెంట్‌ సెల్లార్‌ లో మెకానిక్‌ షెడ్‌ ఉంది. ఇది జీ ప్లస్‌కు చెందిన 4 అంతస్తుల భవనం. తెల్లవారుజామున మంటలు చెలరేగగా… కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగ నాలుగో అంతస్తు వరకు వ్యాపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ భవనంలో మొత్తం 60 మంది నివసిస్తున్నట్లు సమాచారం.

నాలుగో అంతస్తు వరకు పొగ వ్యాపించింది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆరు అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేస్తున్నాయి. ఫ్యాక్టరీలోని నాలుగో అంతస్తుకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలం బయట పార్క్ చేసిన ఆరు ద్విచక్ర వాహనాలు, కారు దగ్ధమయ్యాయి. అయితే మరోవైపు పోలీసులు చెబుతున్నది 16 మందిని కాపాడినట్లు సమాచారం. కారు రిపేర్‌ చేస్తుండగా డీజిల్‌ డబ్బాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ గోదాం పక్కనే ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను, మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ గోదాములో డీజీల్ లాంటివి స్టోర్ చేశారని ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో నాల్గొవ అంతస్తువరకు మంటలు వ్యాపించాచి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

IND vs NED: ప్రపంచకప్‌లో 9 మంది బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. 31 ఏళ్ల ముందు..!

Exit mobile version