NTV Telugu Site icon

Praja Bhavan: ప్రజావాణికి భారీగా జనం.. భూ సమస్య, పెన్షన్ల పై ఫిర్యాదులు

Prajavani

Prajavani

Praja Bhavan: ప్రజా వాణి కి భారీగా జనం క్యూ కట్టారు. మంగళ.. శుక్రవారంలో ప్రజావాణి నిర్వహించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలకు తరలివస్తున్నారు. ప్రజా వాణికి మంత్రులు వచ్చారు. ఫిర్యాదులు స్వీకరణ.. సమస్య తీవ్రతబట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఫిర్యాదుల్లో భూ సమస్య..పెన్షన్ల ల కోసం వస్తున్న ప్రజలే ఎక్కువగా మంది రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ తొమ్మిది గంటలకు కిలోమీటరుకు పైగా పెరిగింది. వారిని క్రమపద్ధతిలో నిలువరించి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది.

Read also: Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు

అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ ప్రజాభవన్‌కు రావాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలు సత్వరమే పరిష్కారం కావడమే కాకుండా హైదరాబాద్ వచ్చే ప్రజల భారం తగ్గుతుందన్నారు. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం తదితర సమస్యలపైనే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా దర్భార్ అనే ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా మార్చారు. అప్పటి నుంచి ప్రతి మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈమేరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు.
Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం