ప్రతీకారం తప్పదు.. మావోయిస్టుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ..
పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండించిన ఆయన.. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు ఆరుగురిని కాల్చిచంపారని ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని లేఖద్వారా హెచ్చరించారు. అధికారపార్టీ నేతలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అంటున్న మావోయిస్టు పార్టీ.. బూటకపు ఎన్కౌంటర్ చేసి తెలంగాణ పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని మండిపడ్డారు.. ఇక, పెసలపాడు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ..
Also Read
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!