మావోయిస్టు నేతలు ఉద్యమంలో బిజీగా వుంటారు. వారు కుటుంబ సభ్యుల గురించి పట్టించుకునే తీరిక వుండదు. తాజాగా మావోయిస్టు కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు రాసిన లేఖ హాట్ టాపిక్ అవుతోంది. తన తల్లి మరణంపై ఆయన రాసిన లేఖ అందరి హృదయాలను కదిలించేదిగా వుంది. ఈ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు భావోద్వేగ లేఖలో … మీ అంత్యక్రియలకు రాలేనందుకు చింతిస్తున్నా.. పెద్దపల్లి పెద్దవ్వలేదని మావోయిస్టు పార్టీ ఏడుస్తున్నది.. నీ మరణం నాకే కాదు యావత్ మావోయిస్ట్ కుటుంబ సభ్యులకి తీరని లోటు. మల్లోజుల కోటేశ్వర రావు, వేణుగోపాల్ రావు లాంటి సామాన్య వ్యక్తులు మావోయిస్ట్ పార్టీకోసం కన్నావ్ అంటూ లేఖ రాశారు. నీ మరణం తనకే కాదు.. యావత్ మావోయిస్ట్ కుటుంబసభ్యులకు తీరని లోటని లేఖలో మల్లోజుల పేర్కొన్నారు. మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్రావు వంటి సామాన్యులను మావోయిస్ట్ పార్టీకోసం కన్నావని వేణుగోపాల్రావు గుర్తు చేశారు.
Read Also: Sunday Bhakthi Tv Stothra Parayanam Live: కార్తిక ఆదివారం ఈ స్తోత్రాలు వింటే..
మల్లోజు వేణుగోపాల్ తల్లి మధురమ్మ గత నెల అక్టోబరు 1న మరణించారు. ఆమె వయసు 96 ఏళ్ళు. తండ్రి మల్లోజుల వెంకటయ్య 1997లో కన్నుమూశారు. ఈ దంపతుల ముగ్గురు కుమారులలో మల్లోజుల వేణుగోపాల్ చిన్నవాడు. సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్ జీ ఎలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు కు తమ్ముడు వేణుగోపాల్. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు.
మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కు చెందిన పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. వేణుగోపాల్ మరో సోదరుడు అంజన్న పౌరోహిత్యం చేసుకుంటున్నాడు. వీరి తాత, తండ్రి.. ఇద్దరూ భారత స్వాతంత్ర్యసమరయోధులు. 2018 డిసెంబరు 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నర్మద అక్కతో పాటు మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా అక్క కూడా మరణించింది.
Read Also: Kerala: అంతర్జాతీయ అంధుల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన కేరళ గవర్నర్
పీపుల్స్ వార్ గ్రూపులో నాయకునిగా భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పనిచేసాడు. మహారాష్ట్రలోని గార్చిరౌలీ ప్రాంతంలో గల మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేసారు. అతను దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళ లోని గోవా నుండి ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్ ను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించాడని చెబుతారు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత వేణుగోపాల్ ని సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు.
ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటనలో 76మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ కి చెందిన పోలీసుల మరణం వెనుక వేణుగోపాల్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కిషన్‌జీ మరణం తరువాత పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు.
Read Also: Thailand: గబ్బిలాల సూప్ వండుకొని తాగింది.. చివరకు జైలు పాలైంది..