స్త్రీ శరీరానికి చాలా అవసరమైన మినరల్ ఐరన్. అలాగే చాలా మంది మహిళలను అధికంగా వేదించే సమస్య రక్తహీనత. అందుకు ఐరన్ లోపం ప్రధాన కారణం. శరీరంలో ఐరన్ లోపించినప్పుడు హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఐరన్ చాలా అవసరం. అందుకే ఐరన్ సహజంగా అందించే పండ్లను మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read :Off The Record : మోడీ పర్యటన వేళ బీజేపీలో చిచ్చు..పెద్దపల్లిలో సీటు కోసం ఫైట్
అంజీర.. అంజీరను తాజాగా లేదా ఎండినవి తినొచ్చు. కానీ ఎండిన అంజీరాలో పోషక విలువలు రెండింతలు ఉంటాయి. వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినడం చాలా మంచిది. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తప్పనిసరిగా వీటిని తినడం చాలా అవసరం. అలాగే ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష లో సహజమైన చక్కెరతో పాటు ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. వీటిని రోజు తినడం వల్ల మీ శరీరానికి కావలసిన ఐరన్ మీకు అందుతుంది. మీరు చేసుకునే స్వీట్‌లో వీటిని వాడండి. దానిమ్మ.. ఏ రకమైన రక్త సమస్యకైనా పరిష్కారం దానిమ్మ ఇదే రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు తాజా దానిమ్మను నేరుగా లేదా జ్యూస్ తీసుకొని ప్రయత్నించండి. మీ శరీరానికి కావలసిన ఐరన్ అందిస్తుంది దానిమ్మ.
అలాగే ఖర్జూరం.. ఇది శక్తితో కూడిన ఆహారం. దీనిలో పోషక విలువలు పుష్కలంగా ఉండి, ఐరన్ తో నిండి ఉంటుంది. మీ శరీరంలో ఐరన్ లోపిస్తే మీరు తప్పకుండా తినాల్సిన ఆహారంలో ఖర్జూరం ఒకటి. రోజు ఉదయం పూట మూడు నాలుగు ఖర్జూరాలు తినడానికి ప్రయత్నించండి. ఆప్రికాట్స్.. ఇవి ఈ మధ్య అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి. వీటిలో విటమిన్‌లు, కార్బోహైడ్రేట్లతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. డ్రై ఆప్రికాట్స్‌లో మీ శరీరానికి కావలసిన ఐరన్ రెండింతలు ఉంటుంది. ఇవి మంచి రుచిగా కూడా ఉంటాయి. ఈ పండ్లను మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకొని మీ శరీరానికి కావలసిన ఐరన్ పొందండి.