NTV Telugu Site icon

Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది

Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బిడ్డగా.. వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా.. వరంగల్ రాజకీయాల గురించి మాట్లాడుతానని అన్నారు. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగలను రాజకీయంగా ఎదుగుదకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారన్నారు. మాదిగ సామాజివర్గానికి చెందిన రాజకీయ నాయకులను వాడుకుంటూ ఈ స్థాయికి కడియం శ్రీహరి వచ్చారన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క మాదిగ బిడ్డను కడియం శ్రీహరి ఎదగనివ్వలేదు.. ఎదగనివ్వడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పేరు చెప్పుకొని కడియం శ్రీహరి రాజకీయంగా ఎంతో లబ్దిపొందారన్నారు. రాజకీయ కుట్రాలతో కడియం శ్రీహరి.. తాటికొండ రాజయ్యను మోసం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు మొదట గుర్తింపునిచ్చింది ఎమ్మార్పీఎస్ ఏ అన్నారు. ఎమ్మార్పీఎస్ నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి తాటికొండ రాజ్యం ఎదగడం పట్ల మాదిగల అందరకి గర్వకారణం అన్నారు. తాటికొండ రాజయ్యకు మళ్ళీ కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవారని తెలిపారు.

Read also: BRS Party: రెండు ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్

కానీ కడియం శ్రీహరి వల్లనే రాజయ్యను భర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుండి తప్పించి ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం శ్రీహరి లాక్కున్నారని మండిపడ్డారు. రాజయ్యపై కావాలనే కడియం శ్రీహరి దుష్ప్రచారం చేయించారని అన్నారు. వద్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఎదుగుదలకు కూడా కడియం శ్రీహరి సహకరించలేదన్నారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ నుండి ఆరుగురు రమేష్ పోటీ చేశాయి.. ఓటమి చెందారన్నారు. కాంట్రాక్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి.. ఒంటరిగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ఆరూరి రమేష్ రెండుసార్లు గెలుపొందారని స్పష్టం చేశారన్నారు. వరంగల్ లో ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ కూడా మాదిగ సామాజిక వర్గం సాకారం తో ఎదిగిన వ్యక్తి అన్నారు. పసునూరి దయాకర్ కూడా రెండోసారి టికెట్ రాకుండా కడియం శ్రీహరి కుట్రలు చేశారని మండిపడ్డారు. చివరికి ఎన్నో డ్రామాలు ఆడి వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ టికెట్ తన కూతురికి వచ్చే విధంగా వ్యవహరించాడన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల ఎదుగుదలను అడుగడుగునా కడియం శ్రీహరి అడ్డుకుంటూ వస్తున్నాడన్నారు. మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఎవరు ఓటు వేయద్దన్నారు. కడియం శ్రీహరికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.
BRS MPS: ఇదంతా కక్ష సాధింపే.. కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఫైర్‌