Police: ప్రజల ధనానికి, ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే దొంగ అయితే ఇంకేముంది. ప్రజలను ఇలా దోచుకోవచ్చని అనుకున్నాడు. రోజంతా ప్రజలకు భద్రత కల్పించే పనిలో నిమగ్నమై ఉండే ఓ కానిస్టేబుల్ తెల్లవారుజామున ప్రజలను దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోలీస్ డబ్బులకు కక్కుర్తి పడిన ఘటనలు తరచూ చూస్తుంటాం. కానీ ఈ ఘటన పోలీసులకే కొత్త అనుభవాన్ని నేర్పింది. బాధ్యత గల పదవిలో ఉంటూ, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తి దొంగలా మారిపోవడం ఏమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీలు చేసి జల్సాగా బతుకుతాం అనుకుంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది.
Read also: Vijay Leo Controversy: విజయ్ ఇచ్చిన మాట తప్పాడు.. లీయో పోస్టర్‌పై పొలిటీషియన్ విమర్శలు
మంచిర్యాల జిల్లా మందమర్రిలో బానేశ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కోట పల్లి పోలీసు స్టేషన్ లో పీసి విధులు నిర్వహిస్తున్నాడు. అప్పులు బాధలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బులు కావాలంటే జీతం సరిపోదు. అందుకని దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశారు. ఈజీగా మణి సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ చేద్దామని అనుకున్నాడు. దానికి టైం ఫిక్స్ చేసుకున్నాడు. డ్యూటీలో ఉంటూనే దొంగతనాలకు పాల్పడ్డాడు. చైన్ స్నాచింగ్ ఎవరు చేస్తున్నారనే దానిపై జీ ఆర్పీ పోలీసులు ఆరా తీస్తుండగా నిర్ఘాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతుండగా పోలీసు కానిస్టేబుల్ బానేశ్ ను
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల, మందమర్రి రైల్వే స్టేషన్ లో దొంగతనాలు చేస్తుండగా జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. బానేశ్ ను రిమాండ్ కు తరలించారు. కానీ కానిస్టేబుల్ ను అదుపులో తీసుకున్నట్లు జీఆర్పీ పోలీసులు గోప్యంగా ఉంచారు. బానేశ్ గతంలోకూ కొమరం భీం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపినట్టు సదరు కానిస్టేబుల్ పై ఆరోపణలు ఉన్నాయి. కాగా.. 317 జీవో తో మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
Preetham Jukalkar: నాగచైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రీతమ్..