Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
- రూ.100 కోసం ఘోర దాడి
- దంపతులపై ఇనుప రాడ్‌తో దాడి
- చికిత్సలో భర్త మృతి
- నిందితుడి కోసం గాలింపు
కేవలం వంద రూపాయల కోసం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొన్న దారుణ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఒక కిరాతకుడు భార్యాభర్తలపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలైన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బిళ్ల శంకరయ్య, అతని భార్య నివసిస్తున్న ప్రాంతంలోనే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సదరు నిందితుడు శంకరయ్య దగ్గరకు వచ్చి వంద రూపాయలు అడిగాడు. అయితే, తన వద్ద డబ్బులు లేవని శంకరయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ చిన్న విషయానికే తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ దుండగుడు, వెంటనే ఒక ఇనుప రాడ్‌ను తీసుకొచ్చి శంకరయ్యపై దాడికి దిగాడు.
CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
భర్తపై దాడి జరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయిన శంకరయ్య భార్య, అతడిని కాపాడుకోవడానికి అడ్డువెళ్లింది. అయితే, మానవత్వం మరచిన ఆ నిందితుడు ఆమెను కూడా వదలకుండా రాడ్‌తో బాదాడు. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన బిళ్ల శంకరయ్య, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన భార్య ప్రస్తుతం తీవ్ర గాయాలతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ముత్యంపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చిన్న కారణానికే ప్రాణం తీయడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
-
Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
-
Dell 15 2026: ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, 15.6-అంగుళాల డిస్ప్లేతో.. డెల్ 15 2026 ల్యాప్‌టాప్ విడుదల
-
Nitish Kumar Bihar Strategy: బీహార్‌ను విడిచేది లేదు.. సర్కార్‌పై ఓ కన్నేసి ఉంచుతా..! నితీష్‌కుమార్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
-
Om Shanti Disco Shanti: దెయ్యాలకే చుక్కలు చూపించే పిచ్చోళ్లు!
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!