Hyderabad: ఆస్ట్రేలియాలో శవమై తేలిన హైదరాబాద్ యువకుడు.. సముద్రంలో మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: భారతదేశం నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. కొంతమంది అక్కడ పనిచేసి బాగా సంపాదిస్తున్నారు.. మరికొందరు ఇండియాకు వచ్చి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజంలో గొప్ప స్థానంలో నిలబెట్టాలనే కోరికతో విదేశాలకు పంపి చదివిస్తున్నారు. ఇటీవల విదేశాల్లో భారతీయ విద్యార్థులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. జాతి వివక్ష కారణంగా కొందరు కాల్పులు జరుపుతున్నారు. బాంబు పేలుళ్లు, రోడ్డు ప్రమాదాలు, సముద్రంలో మునిగిపోవడం వంటి అనేక కారణాలతో మృత్యువాత పడుతున్నారు. తాజాగా విదేశీ గడ్డపై మరో మహమ్మారి పడింది.
Read also: Etela Rajender: ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి మృతదేహం సముద్రంలో లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ షాద్ నగర్ బీజేపీ నేత ఆరతి కృష్ణకు ఏకైక సంతానం. చదువు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం అరవింద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు బంధువులు తెలిపారు.
ఇటీవల ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించకపోవడంతో అరవింద్ తల్లి ఉషారాణి వారం రోజుల క్రితం షాద్ నగర్ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం కుటుంబ సభ్యులతో వచ్చేందుకు అరవింద్ విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ భార్య గార్నిని.. కారు కడుక్కోవడానికి బయటకు వెళ్లిన అరవింద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో సముద్రంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహం అరవింద్‌దేనని నిర్ధారించారు. అయితే అరవింద్ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు? లేక ఎవరైనా చంపి సముద్రంలో పడేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Minister Jupally Krishna Rao: కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా..
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!