జిల్లాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 99 రోడ్డు ప్రమాదాలు సంభవించగా సుమారు 120 మంది వరకు మృతిచెందారు. మరో 255 మంది క్షతగాత్రులయ్యారు.
కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే .. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెలుతున్న నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. మృతులు కమ్మర్ పల్లి ఇందిరాకాలనీకి చెందిన వాసులుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే..కృష్ణ, రజిత దంపతులకు రాగిని, శరణ్య ఇద్దరి పిల్లలు. వీరు కమ్మర్ పల్లి మండలంలోని ఇందిరాకాలనీలో నివాశం వుంటున్నారు. నిన్న అర్ధరాత్రి పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెలుతుండగా .. గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో.. బైక్ పై వెళుతున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తల్లిదండ్రులు కృష్ణ, రజితతో పాటు, పెద్దకూతురు రాగిని కూడా మృతుల్లో వున్నారు. చిన్న కూతురు శరణ్య పరిస్థితి విషమంగా వుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఢీకొట్టి వెళ్ళిన గుర్తు తెలియని వాహనంకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిన్న మంచిర్యాల జిల్లా వాంకిడి-ఆసిఫాబాద్ ప్రధాన రహదారి కమాన చౌరస్తా వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు తిర్యాణికి చెందిన మర్సుకోల శంకర్ గా గుర్తించారు పోలీసులు. మర్సుకోల సుమన్, వాంకిడికి చెందిన బంక రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృత్యువాత పడ్డారు. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎల్లారెడ్డి నుంచి పిట్లం నుంచి ట్రాలీ ఆటో వెలుతుండగా.. అదే సమయంలో పిట్లం నుంచి నిజాంసాగర్ వైపు లారీ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చిన ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 26 మంది ఉన్నారు.
Sri Lanka: విపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి….విషమించిన పరిస్థితులు