జిల్లాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 99 రోడ్డు ప్రమాదాలు సంభవించగా సుమారు 120 మంది వరకు మృతిచెందారు. మరో 255 మంది క్షతగాత్రులయ్యారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే .. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. సోమవారం…