Sri Lanka: విపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి….విషమించిన పరిస్థితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆందోళన బాట పట్టారు. నిరసనకారులు రాజధాని కొలంబోలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహిందా రాజపక్సే అధికారిక నివాసాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న ప్రధానిగా మహిందా రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజపక్సే పూర్వీకులకు సంబంధించిన ఇళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై ఆందోళకారులు దాడి చేశారు.సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ఎంపీల బృందంతో గోటాగోగామాలోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి జరిగింది.గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్నవారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రేమదాసపై నిరసనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. రాజపక్సే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారికి, ప్రభుత్వ వ్యతిరేఖ ఆందోళకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కొలంబోలోని గాలే ఫేస్ గ్రీన్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యతిరేఖ నిరసన వేదికపై శ్రీలంక పొదుజన పెరమున మద్దతుదారులు దాడి చేశారు.
Also Read
- LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
- Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రధాని రాజపక్సెే రాజీనామా చేయవద్దని కోరారు. అనంతరం అక్కడ ఉన్న ఆందోళనకారులతో ఘర్షణ పడి నిరసన ప్రదేశాన్ని ధ్వంసం చేశారు. గాలే ఫేస్ లోని గోటగోగామా వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ మద్దతుదారులు ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుగా నిలవడంతో ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస, జేవీపీ నాయకులు ఎంపీ అనురా కుమార దిసానాయక, కార్మిక సంఘ నేతలు సంఘటన స్థలానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వీరిపై ప్రభుత్వ అనుకూల మద్దతుదారులు దాడికి ప్రయత్నించారు. దీంతో ప్రేమదాస చాలా దూరం పరిగెత్తి, కారెక్కి పారిపోయారు. ప్రతిపక్ష నేత ప్రభుత్వ మద్దతు, వ్యతిరేఖ వర్గాల నుంచి దాడిని ఎదుర్కొన్నారు. రాజపక్సే సర్కార్ ను గద్దె దించడంలో విఫలమయ్యారని ప్రజలు ప్రేమదాసపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 16 మంది గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని కొలంబో లోని నేషనల్ హాస్పిటల్ కు తరలించారు.
Maoists Letter: ఆయుధాలు వదిలి రావాలన్న పిలుపు… మావోయిస్టుల జవాబు
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!