Dead Man Alive: చినిపోయాడని భావించిన వ్యక్తులు చివరి నిమిషంలో అనూహ్యంగా బతికిన ఘటనలు చాలానే ఉన్నాయి.. కొందరు అంతిమయాత్రలో లేచికూర్చుంటే.. మరికొందరు చనిపోయారని వదిలేసిన తర్వాత.. వారికి కదలికలను గుర్తించి సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజా, నిజమాబాద్ మార్చురీ లో వింత ఘటన వెలుగు చూసింది.. చనిపోయాడని మార్చురికి తెచ్చిన ఓ వ్యక్తిలో అనూహ్యంగా కదలికలు వచ్చాయి.. దీంతో, హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
Read Also: CM YS Jagan: సీఎం జగన్ కీలక భేటీ.. మారబోతున్న ఎమ్మెల్యేల జాతకాలు..!
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడం ఏంటి? మార్చురీ అంటేనే శవాలను భద్రపరచడానికే.. పోస్టుమార్టం నిర్వహించడానికో తరలిస్తారు.. అక్కడ చనిపోయిన వ్యక్తి లేవడం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా తిర్మన్‌పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. అయితే, నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతిచెందినట్టు చెప్పారు.. దీంతో, మార్గమద్యలోనే మృతిచెందాడని భావించి.. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.. అక్కడే అంతా షాక్ తిన్నారు.. ఆస్పత్రికి తరలించే క్రమంలో అబ్దుల్ నోట్లో పెట్టిన పైపులను తొలగించారు ఆస్పత్రి సిబ్బంది.. అదే సమయరంలో అబ్దుల్ గఫర్‌లో కదలికలను గుర్తించారు.. దీంతో షాక్ తిన్న సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు తెలియాల్సి ఉన్నా.. చనిపోయాడని భావించిన వ్యక్తిలో కదలికలను గుర్తించి అంతా షాక్‌కు గురయ్యారు.