Bhatti Vikramarka: రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అనలేదని.. కానీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని తెలిపారు. మేడిగడ్డ కూలింది అంటే.. అది ప్రజల లక్ష కోట్ల సొమ్ము ఉందన్నారు. ప్రజలకు తెలియకూడదా..? దాచి పెట్టడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం పౌరుల జీవితల్లోకి చొరబడ్డారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది బ్లాక్ మెయిల్ చేశారని.. ఫోన్ లు విని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది తప్పు కాదా? అని ప్రశ్నించారు. పరిశ్రమలకు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా సమస్య వస్తే..నా దృష్టికి తెండి ..పరిష్కారం చేస్తా అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారిపై కేసులు పెడతామన్నారు. సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వమ్ ఉండదని అంటున్నాడు కేసీఆర్.. లకిందులు తప్పస్సు చేసినా ఢోకా లేదన్నారు.
Read also: Kakarla Suresh : వైసీపీ ప్రభుత్వంలో బతుకు భారం భవిష్యత్తు అంధకారం
R ట్యాక్స్.. B ట్యాక్స్ పై భట్టి మాట్లాడుతూ.. తన లాంటి వాళ్ళు తపనతో రాష్ట్రాన్ని నిర్మించే పనిలో ఉన్నామన్నారు. తన లాంటి వాళ్ళను అడ్డుకోవడానికి కొందరు కుట్ర దారులు R ట్యాక్స్.. B ట్యాక్స్ అని ఆరోపిస్తున్నారని తెలిపారు. SLbc ని పదేళ్ళలో అసలు పట్టించుకోలేదు.. డిండి.. నక్కల గండి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 10 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలకు బట్టి కౌంటర్ ఇచ్చారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే.. ఖమ్మంలో 2 లక్షల ఎకరాల భూమి ఏపీకి ఇచ్చిందని తెలిపారు. ఆర్డినెన్స్ ఇచ్చి భూములు ఇచ్చేసిందన్నారు. అంబేద్కర్ ప్రాణహిత పూర్తి చేయడానికి 3 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి వుండే.. 10 ఏండ్లలో 10 లక్షల కోట్లు కాదు ఇచ్చిందని క్లారిటీ ఇచ్చారు. వాటా గా వచ్చిన డబ్బు 3 లక్షల 70 వేళా 235 కోట్లు అని తెలిపారు. నదిలో నా వాటా ఎంత అనేది తేల్చాలన్నారు. కానీ పదేళ్లు తేల్చలేదని, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా.. నాజోలికి నువ్వు..నీ జోలికి నేను రాను అని మాట్లాడుకున్నారు తప్పితే.. వాటా కోసం అడగలేదన్నారు. పేదల నుండి తీసుకున్న అసైన్డ్ భూములు వెనక్కి ఇచ్చే ప్లాన్ చేస్తున్నామని భట్టి శుభవార్త చెప్పారు. పాదయాత్రలో హామీల అమలుకు శ్రీకారం చుడతామన్నారు.
G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను..