Malla Reddy: మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా దొంగ, ఇద్దరు దొంగలు తయారు అయ్యారని, భూకబ్జా దారులంటూ..వాళ్లను జైల్ కి పంపించే బాధ్యత నాదే అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోడుప్పల్ లో బిఅరెస్ పార్టీ కార్యాలయాన్ని మల్లారెడ్డి ప్రారభించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే చరిత్ర అని అన్నారు. సీఎంగా కేసీఆర్ అయ్యాకనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నారు. కొత్తగా 10 పథకాలు కేసీఆర్ తిసుకువచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పధకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి జంగయ్య దొంగల ముఠా నాయకుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా దొంగ, ఇద్దరు దొంగలు తయారు అయ్యారు.. భూకబ్జా దారులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను జైల్ కి పంపించే బాధ్యత నాదే అన్నారు. దళితులకు భూములను పంచె బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే వెస్ట్ అవుతుందని తెలిపారు. ఇక్కడ ఎంపీ ఎవరికి తెలియదన్నారు. పీసీసి అయ్యి సీట్లు అమ్ముకున్నాడని మండిపడ్డారు. రేవంత్ ఏ మోహం పెట్టుకొని ఇక్కడకు వస్తారు? అని ప్రశ్నించారు. పగటి వేశగాళ్ళు..వాళ్లని నమ్మవొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్ఫ్ బోర్డ్ భూముల విషయం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లామని తెలిపారు. రేవంత్, సుధీర్ రెడ్డి, జంగయ్యని తరమి కొట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీలకు వలసలు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని మూడోసారి కెసిఆర్ సీఎం కావడం పక్కా అని జోష్యం చెప్పారు. పార్టీలో చేరిన యువకులు నాయకులు రాబోయే ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గం లో నేను చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదని అన్నారు.
Vijayapura : కర్ణాటకలో వింత నిరసన.. కరెంట్ ఇవ్వలేదని సబ్ స్టేషన్లో మొసలిని వదిలిన రైతు