Bhagavanth Kesari: భగవంత్ బాదుడు… హాప్ సెంచరీ కొట్టేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోష్‌లో వచ్చాడు బాలయ్య. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా కూడా బాలయ్య హిట్ ట్రాక్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్యను రెగ్యులర్ రొట్ట కొట్టుడు క్యారెక్టర్ లో కాకుండా… ఏజ్ కి తగ్గ పాత్రలో ఫ్రెష్ గా చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. డే వన్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరి… మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. ఫస్టే డే 33 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన భగవంత్ రెండో రోజు కూడా దుమ్ముదులిపేసింది. రెండో రోజు బాలయ్యకు పోటీగా మాస్ మహారాజా ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరోవైపు దళపతి విజయ్ ‘లియో’ నుంచి గట్టి పోటీ ఉంది.
ఈ రెండు సినిమాలు సోసోగానే ఆడియన్స్ ని మెప్పించాయి. దీంతో బాలయ్యకి అడ్డు లేకుండా పోయింది. ఈ దసరా విన్నర్ యునానిమస్ గా బాలయ్య అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యడంలో బాలయ్య ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ కారణంగానే భారీ వసూళ్లను అందుకున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. మొత్తంగా వరల్డ్‌వైడ్‌గా రెండు రోజుల్లో 51 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్‌కు రెడీ అవుతున్న బాలయ్య… రెండు రోజుల్లోనే హాప్ సెంచరీ కొట్టేసి సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. ఇక యూఎస్‌లో 7 లక్షల 50 వేల డాలర్స్ మార్క్‌ని టచ్ చేసి 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. దీంతో మొదటి మండేకి భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
A #BlockbusterDawath at the Box office 🔥#BhagavanthKesari Grosses 51.12 CR WORLDWIDE IN 2 DAYS 💥💥
In cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi @sahugarapati7 @JungleeMusicSTH pic.twitter.com/puSAke2was
— Shine Screens (@Shine_Screens) October 21, 2023
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!