Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Malla Reddy Comments On Boora Narsaiah Goud

Mallareddy: రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ల కోసమే ఈ మునుగోడు ఎన్నిక

Published Date :October 16, 2022 , 3:32 pm
By NTV WebDesk
Mallareddy: రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ల కోసమే ఈ మునుగోడు ఎన్నిక
  • Follow Us :
  • google news
  • dailyhunt

Malla Reddy Comments On Boora Narsaiah Goud: మునుగోడు ఉప ఎన్నిక అభివృద్ధి కోసం రాలేదని.. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ల కోసమే వచ్చిందని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. ఈ సమయంలో ఒక్కసారి కూడా నియోజకవర్గంలోకి రాలేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మీ చెక్కులు కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీని నట్టేట ముంచారని ఆగ్రహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. మూడేళ్ల నుంచి నియోజకవర్గానికి ఏం చేయనిది.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తావని రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు.

ఇదే సమయంలో.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారడంపై కూడా మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు బూర నర్సయ్య ఎవరో ప్రజలకు తెలియదని.. కేసీఆర్ బొమ్మ మీద ఆయన ఎంపీగా గెలిచాడని చెప్పారు. బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారినంత టీఆర్ఎస్‌కు నయా పైసా నష్టం లేదని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి తమ్ముడే ఈ బూర నర్సయ్య అని కౌంటర్ వేశారు. ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన ఆయన.. ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదని, ప్రజల సమస్యల్ని తీర్చలేదని అన్నారు. అందుకే బూర నర్సయ్యను ప్రజలు ఓడగొట్టారన్నారు. ఇప్పుడు ఆయన్ను ప్రజలు పూర్తిగా మర్చిపోయారని పేర్కొన్నారు. కాగా.. తాను ఎన్నో అవమానాల్ని దిగమింగానని, పార్టీకి తన అవసరం లేదనిపించిందని పేర్కొంటూ బూర నర్సయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే! ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కి ఇచ్చిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

‘‘మీ నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం శక్తివంచన లేకుండా పనిచేశానుఎంపీగా గెలిచిన తర్వాత ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాను. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పనులు చేశాను. మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు కానీ, కానీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. బుల్డోజర్‌ గుర్తు.. అంతర్గత కుట్రలతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాయని అనిపించి, మీ దృష్టికి తీసుకురావాలనుకున్నా. కానీ అవకాశం దొరకలేదు. ఇక నేను టీఆర్ఎస్‌లో ఉండి ఏం చేయాలి? మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నాతో ఒక్కసారి కూడా సంప్రదించలేదు. ఎన్నో అవమానాలను దిగమింగాను. నా అవసరం పార్టీకి లేదని అనిపించింది’’ అని బూర నర్సయ్య లేఖలో తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Boora Narsaiah Goud
  • cm kcr
  • malla reddy
  • Munugode By-Elections
  • rajagopal reddy

తాజావార్తలు

  • NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

  • Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..

  • Stock Market Crash: స్టాక్ మార్కెట్‌కు భారీ ఎదురుదెబ్బ.. సెన్సెక్స్ 1420 పాయింట్లు పతనం, నిఫ్టీ కూడా కుప్పకూలింది

  • Shaheed Diwas: నేడు షహీద్ దివస్.. అమరవీరుల దినోత్సవాన్ని సంవత్సరానికి 3 సార్లు.. ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

  • Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions