NTV Telugu Site icon

కాంగ్రెస్‌లో కొత్త కమిటీల కలవరం..! ఇవాళ కీలక భేటీ

congress flag

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి గ్రూపులు, అంతర్గత కలహాలు, కుమ్ములాట ఇలా ఏవీ కొత్త కాదు.. సందర్భాలను బట్టి అంతర్గత విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి.. తాజాగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కలవరం మొదలైంది.. కొత్త కమిటీలు వివాదానికి దారితీస్తున్నాయి… ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మండల కమిటీల మార్పిడితో పాత క్యాడర్‌లో ఆందోళన మొదలైంది.. ఈ పరిణామంపై పాత క్యాడర్‌ ఆగ్రహంగా ఉంది. ఇదంతా మహేశ్వర్ రెడ్డి వర్గం పనే అంటున్న మండిపడుతోంది ప్రేమ్ సాగర్ రావు వర్గం… ఇటీవల వేసిన మండల కమిటీలతో కాంగ్రెస్‌లో కొత్త వివాదం మొదలైనట్టు అయ్యింది.. దీనిపై బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్ తోపాటు మంచిర్యాత, ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ప్రేమ్ సాగర్ రావు కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. సాయంత్రం మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. కొత్త కమిటీల్లో తమకు జరిగిన అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానంటున్నారు ప్రేమ్‌ సాగర్‌ రావు.. ఇక, టి.పీసీసీలోనూ కొత్త పీసీసీ చీఫ్‌.. కాంగ్రెస్‌ సీనియర్ల మధ్య ఇప్పటికీ సరైన సందర్భాలు లేవని పలు సందర్భాల్లో బహిర్గతం అవుతున్న సంగతి తెలిసిందే.