NTV Telugu Site icon

Maheshwar Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కౌంటర్.. ఆ వ్యాఖ్యలు హాస్యాస్పదం

Maheshwar Reddy On Indrakir

Maheshwar Reddy On Indrakir

Maheshwar Reddy Counter To Minister Indrakiran Reddy: కాంగ్రెస్ పార్టీలో ప‌నైపోయిందని, రేపోమాపో పార్టీ మారడం ఖాయమని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి చేసిన తనమీద వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి దొంగ జపం చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పార్టీలు మారే రాజకీయాలు నేను చేయలేదని తేల్చి చెప్పారు. రెండుసార్లు ఓటమి చవిచూసినా, కష్టాలు ఎదురైనా.. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తప్ప పార్టీలు మారలేదని స్పష్టం చేశారు. అరు నెలల్లోనే ఐదు పార్టీలు మారిన చరిత్ర, అవకాశవాద రాజకీయాలు చేసే చరిత్ర.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని.. అలాంటి వ్యక్తి తనపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పార్టీ మారాలనుకుంటే తనకు ఎవరూ అడ్డు లేరని.. కష్టమైనా, నష్టమైనా తాను కాంగ్రెస్ పార్టీలోనే తొమ్మిదేళ్ల నుంచి ఉన్నానని అన్నారు.

Bus Accident: అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 64మందికి గాయాలు

అధికారం ఉందని తన మీద దొంగ కేసులు పెట్టించినా.. మున్సిపల్ ఉద్యోగాల్లో ఏం జరిగిందో నిర్మల్ ప్రజలకు తెలుసని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. స్వయంగా మీ కౌన్సిలరే అవినీతి జరిగిందని చెప్పిన మాట వాస్తవం కాదా? బాధితులకు అండగా నేను దీక్ష చేస్తే భయంతో ఎంక్వైరీకి ఆదేశించిన మాట వాస్తవం కాదా? కలెక్టర్ బదిలీపై వెళ్తూ నియామకాలు రద్దు చేసిన విషయం నిజం కాదా? అభ్యర్థులు కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇప్పటికీ డబ్బులు ఇచ్చిన ఎంతోమంది నిరుద్యోగులు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మున్సిపల్ నియామకాల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టించడం కాదని, దుమ్ముంటే మంత్రిగా వాస్తవాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. తొమ్మిదేళ్లుగా నిర్మల్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఎక్కడ భూములున్నాయో అక్కడ డీ1 పట్టాల పేరుతో కబ్జాలు.. ఎక్కడ గుట్టలు వున్నాయో అక్కడ క్రషర్స్ పెట్టడం తప్ప.. నిర్మల్ ప్రజలకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? అని ప్రశ్నించారు.

Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం

Show comments