Maheshwar Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కౌంటర్.. ఆ వ్యాఖ్యలు హాస్యాస్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy Counter To Minister Indrakiran Reddy: కాంగ్రెస్ పార్టీలో పనైపోయిందని, రేపోమాపో పార్టీ మారడం ఖాయమని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి చేసిన తనమీద వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి దొంగ జపం చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పార్టీలు మారే రాజకీయాలు నేను చేయలేదని తేల్చి చెప్పారు. రెండుసార్లు ఓటమి చవిచూసినా, కష్టాలు ఎదురైనా.. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తప్ప పార్టీలు మారలేదని స్పష్టం చేశారు. అరు నెలల్లోనే ఐదు పార్టీలు మారిన చరిత్ర, అవకాశవాద రాజకీయాలు చేసే చరిత్ర.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని.. అలాంటి వ్యక్తి తనపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పార్టీ మారాలనుకుంటే తనకు ఎవరూ అడ్డు లేరని.. కష్టమైనా, నష్టమైనా తాను కాంగ్రెస్ పార్టీలోనే తొమ్మిదేళ్ల నుంచి ఉన్నానని అన్నారు.
Bus Accident: అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 64మందికి గాయాలు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అధికారం ఉందని తన మీద దొంగ కేసులు పెట్టించినా.. మున్సిపల్ ఉద్యోగాల్లో ఏం జరిగిందో నిర్మల్ ప్రజలకు తెలుసని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. స్వయంగా మీ కౌన్సిలరే అవినీతి జరిగిందని చెప్పిన మాట వాస్తవం కాదా? బాధితులకు అండగా నేను దీక్ష చేస్తే భయంతో ఎంక్వైరీకి ఆదేశించిన మాట వాస్తవం కాదా? కలెక్టర్ బదిలీపై వెళ్తూ నియామకాలు రద్దు చేసిన విషయం నిజం కాదా? అభ్యర్థులు కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇప్పటికీ డబ్బులు ఇచ్చిన ఎంతోమంది నిరుద్యోగులు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మున్సిపల్ నియామకాల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టించడం కాదని, దుమ్ముంటే మంత్రిగా వాస్తవాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. తొమ్మిదేళ్లుగా నిర్మల్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఎక్కడ భూములున్నాయో అక్కడ డీ1 పట్టాల పేరుతో కబ్జాలు.. ఎక్కడ గుట్టలు వున్నాయో అక్కడ క్రషర్స్ పెట్టడం తప్ప.. నిర్మల్ ప్రజలకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? అని ప్రశ్నించారు.
Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు