NTV Telugu Site icon

Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పై ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీపై అబద్దపు వ్యాఖ్యలు చేశారని ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపా దాస్ మున్శి పైన బీజేపీ నాయకులు ప్రభాకర్ చేసిన ఆరోపణలు వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. దీపాదాస్ మున్శి నిజాయితీ, నిబద్ధత గల నాయకురాలని తెలిపారు. ఆమె తెలంగాణ ఇంచార్జ్ గా ఉండడంతో బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో స్వీప్ చేయబోతుందన్నారు.

బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని.. దాంతో పిచ్చిలేసినట్టు బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పస లేని, పనికి రాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పూట గడుపుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకుల మాటలను ఎవరు నమ్మరని అన్నారు. బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకొము.. జాగ్రత్త… అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్శికి క్షమాపణ చెప్పి తన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు – కాంగ్రెస్ నాయకులు..

దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దివాళా తీయడానికి నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. తను దీపాస్ మున్షీని బెంగాలీ కాళీ మాతగా అభివర్ణించడం సరికాదని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు, అబద్ధాలతో బతికే పార్టీ బీజేపీ అని, ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఉన్నారని, ఎంపీ టికెట్ కోసమే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. దీపాదాస్ మున్షీపై చేసిన వ్యాఖ్యలకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ” దీపదాస్ మున్షీ బెంగాల్ టైగర్. తూటాలు ఎదుర్కొన్న నాయకుడు. అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు సహకరించిన నాయకురాలు దీపా దాస్ మున్షీ. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేలను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.

అయితే అయోధ్య రామమందిర అంశాన్ని రాజకీయం చేయడం తగదని, రామమందిర సందర్శనకు ప్రత్యేక దినం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పూజలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తుందని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని దీపా దాస్ మున్షీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Mohammed Shami: ఆ ఇద్దరు తెలుగు హీరోలు చాలా ఇష్టం: షమీ