MLC Elections: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడితే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున కౌంటింగ్ చేపట్టకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Read also: Nellore Court: ఎస్సైకి 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా..
ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ను ఈ నెల రెండో తేదీన అంటే ఇవాళ (మంగళవారం) ప్రారంభించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు ఉపఎన్నిక రావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ పోటీ వ్యూహాలతో క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నాయి. ఫలితాల కోసం పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూడడంతో కౌంటింగ్ వాయిదా పడి నేతలు నిరుత్సాహానికి గురయ్యారు.
Read also: Tillu Cube : టిల్లు గాడి ప్లానింగ్ మామూలుగా లేదు…ఈసారి సూపర్ హీరో..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా సుదర్శన్‌గౌడ్ బరిలో నిలిచారు. గత గురువారం ఈ స్థానంలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు.
Fight Leopard: చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్