NTV Telugu Site icon

BRS Maha Dharna: మహబూబాబాద్‌ లో 144 సెక్షన్‌.. భయాందోళనలో మానుకోట ప్రజలు..

Mahabubabad 144 Section

Mahabubabad 144 Section

BRS Maha Dharna: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్‌ కూడా ధర్నాను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌లో కేటీఆర్‌ పర్యటన వాయిదా పడింది. గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసనగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బుధవారం రాత్రి మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్ ఎస్ నాయకులు రైతుల మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.

అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రైతు మహా ధర్నాకు కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో యాత్రను రద్దు చేసుకున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు పోలీసులు 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. బీఆర్ఎస్‌ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలో భారీగా పోలీస్‌ భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహబూబాబాద్ గల్లీ గల్లీలో సెక్షన్ 144 అమలు అవుతోందని మైక్ సెట్ ద్వారా పోలీసుల ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. పోలీసు పహారాతో మానుకోట ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Missing Case: హైదరాబాద్ లో అదృశ్యమైన బాలికలు ఏపీ సూర్యలంక బీచ్ లో ప్రత్యక్షం..

Show comments